ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన వార్దా తుపాను కారణంగా ముప్పు పొంచివుందన్న సమాచారంతో నెల్లూరు జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వార్దా తీవ్ర పెను తుపానుగా మారడంతో 11 మండలాల్లోని 20 గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశామని జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు తెలిపారు.