రాష్ట్ర విభజనను అడ్డుకునే ప్రయత్నాలు చేయకుండా, కాంగ్రెస్ అధిష్ఠానం అడుగులకు మడుగులొత్తుతున్న కేంద్ర మంత్రి చిరంజీవికి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో సమైక్య సెగ గట్టిగా తగిలింది. రాజమండ్రిలోని కంబాల చెరువు ప్రాంతంలో చిరంజీవి కాన్వాయ్ని న్యాయవాద జేఏసీ సభ్యులు అడ్డుకున్నారు. జై సమైక్యాంధ్ర అని నినాదాలు చేసుకుంటూ వాహనంపైకి న్యాయవాదులు దూసుకెళ్లారు. వారిని పోలీసులు అడ్డుకుని, చిరంజీవి కాన్వాయ్ వెళ్లేందుకు మార్గం సుగమం చేశారు.