గుంటూరు నగరం నల్లపాడురోడ్డు, మిర్చియార్డు సమీపంలో ఈ నెల 16వ తేదీన నిర్వహించే యువభేరి సదస్సును విజయవంతం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, గుంటూరు జిల్లా పరిశీలకుడు బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. గుంటూరులోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సదస్సులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విద్యార్థులనుద్దేశించి ప్రసగించి, విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.