గుండెపోటుతో ఆదివారం హఠాన్మరణం చెందిన టీడీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి భౌతికకాయానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు. భూమా కుమార్తె, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియను ఓదార్చారు. అనంతరం మాట్లాడుతూ.. పార్టీ పట్ల భూమా ఎంతో విధేయతగా ఉండేవారని, తనకు చాలా సన్నిహితుడని గుర్తు చేసుకున్నారు.