ఆంధ్రప్రదేశ్ శాసనసభ శీతాకాల సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటలకు సభ సమావేశమవుతుంది. ఈ నెల 23 వరకు సమావేశాలు కొనసాగుతాయి. 21వ తేదీ ఆదివారం సెలవు కాబట్టి సభ సమావేశం కాదు. గురువారం సభ కొలువుదీరిన వెంటనే ఇటీవల మృతి చెందిన తిరుపతి ఎమ్మెల్యే ఎం.వెంకటరమణకు సంతాపం ప్రకటించి మరుసటి రోజుకు వాయి దా పడుతుంది. అంతకుముందు ఉదయం 8 గంటలకు శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ (బీఏసీ) సమావేశం స్పీకర్ కోడెల శివప్రసాదరావు అధ్యక్షతన జరుగుతుంది. సభలో ఏఏ అంశాలు చర్చించాలో బీఏసీలో నిర్ణయిస్తారు.