పెద్ద నోట్ల చలామణి వాడకంపై మోదీ ప్రభుత్వం తీసుకున్న అకస్మాత్తు నిర్ణయంపై కాంగ్రెస్ పలు ప్రశ్నలు సంధించింది. దీనివల్ల సామాన్య ప్రజలు, రైతులు చాలా ఇబ్బందులు పడతారని ఆందోళన వ్యక్తంచేసింది. అలాగే వ్యాపారులు, చిన్న వర్తకులు, గృహిణులు కూడా ఆందోళన చెందుతారని పేర్కొంది. మంగళవారం పార్టీ ముఖ్యఅధికార ప్రతినిధి రణ్‌దీప్ మీడియాతో మాట్లాడుతూ.. నల్లధనం నియంత్రణకు తీసుకునే అర్థవంతమైన చర్యలకు తమ పార్టీ ఎప్పటికీ మద్దతు పలుకుతుందన్నారు.