పవన్ కల్యాణ్ అభిమానులపై నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. శిల్పకళా వేదికలో చిరంజీవి పుట్టినరోజు వేడుకల సందర్భంగా పవన్ కల్యాణ్ అభిమానులపై శుక్రవారం రాత్రి నాగబాబు ధ్వజమెత్తారు. ' చాలాసార్లు ఓపిక పట్టాం, వాడు రాకపోతే మేమేం చేస్తాం. పవన్ ను ఎన్నిసార్లు పిలిచామో తెలుసా మీకు? దమ్ముంటే మీరెళ్లి పవర్ స్టార్ అడగండి. ఇక్కడ అరవడం కాదు. ప్రతిసారీ పవర్ స్టార్, పవర్ స్టార్ అని అరుస్తారు. మీకు దమ్ముంటే వాడి ఆఫీసుకు వెళ్లండి.