‘‘నా కెరీర్‌కి ఇది చాలా ప్రత్యేకమైన సినిమా. ఇప్పటివరకూ చేయని పాత్రను ఇందులో చేశాను. నా పాత్ర మాత్రమే కాదు.. లావణ్య పాత్ర కూడా చాలా బాగుంటుంది. మా ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరింది. ఫ్యామిలీ మొత్తం చూడాల్సిన సినిమా ఇది’’ అని నాని చెప్పారు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 క్రియేషన్స్, యూవీ క్రియేషన్స్ పతాకంపై నాని, లావణ్య త్రిపాఠి జంటగా బన్నీ వాసు నిర్మిస్తున్న చిత్రం ‘భలే భలే మగాడివోయ్’. మారుతి దర్శకుడు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. వచ్చే నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.