రిలయన్స్ జియో ఎంట్రీతో టెలికం రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఉచిత కాలింగ్ సేవలు, డేటా అంటూ తారిఫ్ వార్ ను మొదలుపెట్టిన జియో బాటలోకి మిగిలిన దేశీయదిగ్గజ టెలికాం కంపెనీలు అనివార్యంగా ఎంట్రీ ఇస్తున్నాయి. ముఖ‍్యంగా భారతి ఎయిర్ టెల్, వోడాఫోన్, ఐడియా లాంటి మొబైల్ ఆపరేటర్లు తమ ఖాతాదారులను వివిధ ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చాయి.