దేశ కార్పొరేట్ చరిత్రలో కనివినీ రీతిలో చైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్త్రీని తొలగించిన వివాదంలో తలమునకలై ఉన్న రతన్ టాటా, ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయం పెద్ద నోట్ల రద్దుపై స్పందించారు. మూడు అత్యంత ముఖ్యమైన ఆర్థిక సంస్కరణల్లో పెద్ద నోట్ల రద్దు ఒకటని రతన్ టాటా అభివర్ణించారు. బ్లాక్మనీని నిర్మూలించడానికి ఇది ఎంతో సహకరిస్తుందంటూ డీమానిటైజేషన్ను కొనియాడారు.