నేడు విద్యుత్ బిల్లులు చెల్లింపునకు అవకాశం
కడప కార్పొరేషన్: విద్యుత్ వినియోగదారుల సౌకర్యార్థం ఈనెల 26వ తేది ఆదివారం సెలవుదినం అయినప్పటికీ జిల్లా వ్యాప్తంగా విద్యుత్ బిల్లుల వసూలు కేంద్రాలు యఽథాతథంగా పనిచేస్తాయని ఏపీఎస్‌పీడీసీఎల్ పర్యవేక్షక ఇంజినీరు ఎస్. రమణ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
కడప వైఎస్‌ఆర్ సర్కిల్: ఈనెల 27న ఆర్చరీ ఎంపికలను నిర్వహించనున్నట్లు జిల్లా ఆర్చరీ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ వీవీ జనార్దన్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఎంపికలు డాక్టర్ వైఎస్సార్ క్రీడా పాఠశాలలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సబ్ జూనియర్స్ బాల బాలికలకు నిర్వహించే ఈ ఎంపిక ల్లో ఇండియన్, కాంపౌండ్, రికర్వ్ విభాగాలు ఉంటాయని వివరించారు.
కడప అగ్రికల్చర్: జిల్లాకు శనివారం 2600 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చింది. సంబంధిత యూరియా రేక్ పాయింట్‌ను కడప మండల వ్యవసాయ అధికారి సురేష్‌కుమార్‌రెడ్డితో కలిసి జిల్లా వ్యవసాయ అధికారి చంద్రనాయక్ పరిశీలించారు. ఇందులో 2200 మెట్రిక్ టన్నులను వైఎస్సార్‌జిల్లాకు కేటాయించగా మరో 400 మెట్రిక్ టన్నులను అన్నమయ్య జిల్లాకు కేటాయించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి చంద్రనాయక్ మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడా యూరియా కొరత లేదన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయ వ్యవసాయ విస్తరణ అధికారి సుధీర్, కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.
కడప సెవెన్‌రోడ్స్: కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నెల 27వ తేదీ సోమవారం జిల్లా వ్యాప్తంగా అధిక వర్షపాతం కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో కలెక్టరేట్‌లో నిర్వహించవలసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర్ నాయుడు శనివారం ఒక ప్రకటనలో తెలిపా రు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గుర్తించాలని పేర్కొన్నారు. అర్జీదారులు తమ అర్జీలు మీ కోసం డాట్ ఏపీ డాట్ జీఓవీ డాట్ ఇన్ వైబ్సెట్‌లో నమోదు చేసుకోవచ్చన్నారు.
జిల్లా పోలీస్ కార్యాలయంలోనూ..
కడప అర్బన్: జిల్లా పోలీస్ కార్యాలయంలో ఈనెల 27న నిర్వహించవలసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా ఎస్.పి షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గుర్తించాలని సూచించారు.
కడప సెవెన్‌రోడ్స్: తనను సక్రమంగా విధులు నిర్వహించనీయకుండా కొందరు వ్యక్తులు ఇబ్బందులు సృష్టిస్తున్నారని స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ కడప హెచ్‌అండ్‌టీ కాంట్రాక్టర్ ఆర్‌ఎన్ సంజీవరాయుడు శనివారం ఇన్‌చార్జి కలెక్టర్ అదితిసింగ్‌కు ఫిర్యాదు చేశారు. తమకు కాంట్రాక్టు దక్కలేదన్న కక్షతో కొందరు తనను పలు రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. ప్రతిరోజు ఏదో ఒక సమస్య సృష్టించి తన కాంట్రాక్టును తానే రద్దు చేసుకునేలా ఒత్తిడి చేస్తున్నారన్నారు. హమాలీలు పనిచేయకుండా ఆటంకం కల్పిస్తున్నారని చెప్పా రు. రోజూ తన విధులకు ఆటంకం కలిగిస్తున్నారని చెప్పారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే తాము విధులను సక్రమంగా నిర్వర్తించలేమని పేర్కొన్నారు. ఏదైనా తమపైన ఆరోపణలు వస్తే తక్షణమే సంబంధిత అధికారులతో పరిశీలన చేయించాలని కోరారు.
కడప వైఎస్‌ఆర్ సర్కిల్: కర్నూలులో జరిగిన బస్సు దుర్ఘటన నేపథ్యంలో జిల్లాలో రవాణా శాఖ అధికారులు శుక్ర, శనివారాల్లో ప్రైవేట్ ట్రావెల్ బస్సుల పై దాడులు చేశారు. 34 కేసులు నమోదు చేసినట్లు జిల్లా ఇన్‌చార్జ్ ఉప రవాణాశాఖ కమిషనర్ వీర్రాజు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కడపలో 10 బస్సు లపై, ప్రొద్దుటూరులో 9 బస్సులపై, బద్వేల్ లో 9 బస్సులపై, పులివెందులలో 6 బస్సులపై మొత్తం 34 కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. ఈ 34 కేసులలో అగ్ని ప్రమాద నివారణ పనిముట్లు లేని కారణంగా 19 బస్సులపై కేసు నమోదు చేశామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న బస్సులపై నిఘా ఉంచి నత్యం తనిఖీలు చేపడతామని వివరించారు. ప్రైవేట్ బస్సులు అన్ని రకాల పత్రాలను సక్రమంగా ఉంచుకొని బస్సులను నడపాలని ఆదేశించారు.


