ఆర్టీసీ బస్సుకు తప్పిన పెను ప్రమాదం
ఎర్రగుంట్ల : ఎర్రగుంట్ల పట్టణంలోని రైల్వే స్టేషన్‌కు వెళ్లె క్రాస్ వద్ద ఆర్టీసీ బస్సుకు శనివారం పెను ప్రమాదం తప్పింది. ఆర్టీసీ బస్సు క్రాస్ రోడ్డు వద్ద మలుపు తిరుగుతుండగా వెనుక విద్యుత్ స్తంభానికి ఆనుకుని వచ్చింది. కొద్దిగా ఆదమరిచి ఉంటే విద్యుత్ స్తంభం తగిలి పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని స్థానికులు భయపడ్డారు. ఈ క్రాస్ వద్ద రోడ్డును ఆనుకొని దుకాణాలు, తోపుడు బండ్లు అడ్డంగా ఉంటాయి. వాహనాల రాకపోకల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పటికై నా అధికారులు స్పందించి క్రాస్ రోడ్డులోని అడ్డంకులను, ఆక్రమణలను తొలగించి ప్రమాదాలను నివారించాలని స్థానికులు కోరుతున్నారు.
వర్షానికి కూలిన మట్టి మిద్దె
వేంపల్లె : వేంపల్లె పట్టణం 12వ వార్డు జెండామాను వీధిలో ఉన్న మాబు ఖాతున్‌కు చెందిన మట్టి మిద్దె గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కూలింది. ప్రమాదం తప్పడంతో బాధితులు ఊపిరి పీల్చుకున్నారు. బాధితురాలు మాట్లాడుతూ శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో మిద్దె కూలిందన్నారు. వస్తువులు ధ్వంసం కావడంతో దాదాపు రూ.50 వేలు నష్టం జరిగిందన్నారు.
ఆర్టీసీ బస్సుకు తప్పిన పెను ప్రమాదం


