ఉత్సాహంగా బాస్కెట్ బాల్ ఎంపికలు
కడప వైఎస్‌ఆర్ సర్కిల్: నగరంలోని డీఎస్‌ఏ క్రీడా మైదానంలో శనివారం నిర్వహించిన అండర్ 14,17 బాస్కెట్ బాల్ ఎంపికలు ఉత్సాహంగా సాగాయి. ఈ ఎంపికలకు దాదాపు 150 క్రీడాకారులు పాల్గొన్నట్లు ఎస్‌జీఎఫ్ సెక్రటరీ చంద్రావతి పేర్కొన్నారు. దాదాపు 12 మంది వ్యాయామ ఉపాధ్యాయులు ఎంపికలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులు ఇజ్రాయిల్, సుబ్బయ్య, గణేష్, విశ్వనాథ్, సుబ్బ మ్మ, ఉమా, సుభద్ర పాల్గొన్నారు.
నేడు వాలీబాల్ ఎంపికలు
నేడు నగరంలోని మాంటిస్సోరి పాఠశాలలో వాలీబాల్ ఎంపికలను నిర్వహిస్తున్నట్లు ఎస్‌జీఎఫ్ సెక్రటరి చంద్రావతి పేర్కొన్నారు. క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యాయులు ఉదయం 9 గంటల లోపల హాజరు కావాలన్నారు.
ఉత్సాహంగా బాస్కెట్ బాల్ ఎంపికలు


