
పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట
వల్లూరు : పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులకు ఉందని అదే లక్ష్యంతో పేరెంట్, టీచర్ల సమావేశాలను ప్రభుత్వం ప్రాధాన్యతతో నిర్వహిస్తోందని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అన్నారు. వల్లూరు మండల పరిధిలోని గంగాయపల్లెలోని ఏపీ మోడల్ స్కూల్‌లో గురువారం నిర్వహించిన మెగా పేరెంట్స్, టీచర్స్ సమావేశానికి కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి, కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కడప ఆర్డీవో జాన్ ఇర్విన్, డీఈఓ షంషుద్దీన్, ఎంపీడీఓ రఘురాం, తహసీల్దార్ శ్రీవాణి, ప్రిన్సిపల్ సురేష్ బాబు పాల్గొన్నారు.