
ఆపరేషన్ క్యాంపస్ సేఫ్ జోన్ స్పెషల్ డ్రైవ్
కడప అర్బన్ : జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు,కు వంద మీటర్ల విద్యా సంస్ధలకు వంద మీటర్ల దూరంలో బుధవారం ఆపరేషన్ క్యాంపస్ సేఫ్ జోన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించారు. ఎస్పీ ఇజి.అశోక్‌కుమార్ ఆదేశాలతో పోలీస్ అధికారులు తమ పరిధిలోని పాఠశాలలు, కళాశాల, విద్యా సంస్ధలను సందర్శించి వంద మీటర్ల లోపు టీ షాపులు, పాన్ షాపులు, కిరాణం షాపులలో సిగరెట్లు, కై నీ, గుట్కా వంటి పొగాకు ఉత్పత్తుల తనిఖీలు చేసి వాటి అమ్మకాలు నిషేధమని దుకాణదారులకు తెలిపారు. విద్యా సంస్ధల వద్ద పొగాకు ఉత్పత్తులను విక్రయించే దుకాణ యజమానులకు కోప్టా యాక్టు ప్రకారం జరిమానా విధించారు.