
దేవుని కడప ఆలయ అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి
కడప సెవెన్‌రోడ్స్ : దేవుని కడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని తిరుమల–తిరుపతి దేవస్థానం జేఈఓ వల్లూరు వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన దేవుని కడప ఆలయాన్ని సందర్శించి జరుగుతున్న పనులను పరిశీలించారు. ఆలయ పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో జరగనున్న బాలాలయం కోసం ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. గర్భాలయం, పోటుగదిలో వర్షపు నీరు లీకేజీలు లేకుండా చూడాలన్నారు. పుష్కరిణి వద్ద మురుగునీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం ఆయన ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి ఆలయాన్ని సందర్శించి అక్కడ జరుగుతున్న పనులపై అధికారులతో సమీక్షించారు. ఈ కార్యక్రమంలో కడప మున్సిపల్ కమిషనర్ మనోజ్‌రెడ్డి, విద్యుత్‌శాఖ ఎస్‌ఈ వెంకటేశ్వర్లు, డిప్యూటీ ఈఓలు నటేష్‌బాబు, ప్రశాంతి, ఈఈలు నాగరాజు, సుమతి, ఆలయ అర్చకులు, ఆలయ ఇన్‌స్పెక్టర్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం