
సీఎం జిల్లా పర్యటనను విజయవంతం చేయండి
కడప సెవెన్‌రోడ్స్ : జిల్లాలో ఈ నెల 26 నుంచి 29వ తేదీ వరకు నిర్వహించనున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. సోమవారం రాత్రి కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్ హాలులో రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లపై జేసీ అదితిసింగ్, డీఆర్వో విశ్వేశ్వర నాయుడు, కడప ఆర్డీవో జాన్ ఇర్విన్, నగర కమీషనర్ మనోజ్‌రెడ్డిలతో కలిసి జిల్లా అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కడప నగర సమీపంలోని పబ్బాపురం గ్రామ పరిధిలో జరిగే ‘మహానాడు’ కార్యక్రమంలో పాల్గొనే నిమిత్తం జిల్లాకు విచ్చేస్తున్న ముఖ్యమంత్రికి అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు పాటించేలా సంబందిత అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో డీపీవో రాజ్యలక్ష్మి, జెడ్పీ సీఈవో ఓబులమ్మ, డీఎంహెచ్‌ఓ డాక్టర్ నాగరాజు, పోలీసు, ఫైర్ ఆఫీసర్ ధర్మారావు, విద్యుత్, ఆర్‌అండ్‌బీ, పీఆర్ వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ప్రజా సేవలపై మరింత దృష్టి
ప్రభుత్వ పథకాలు, సేవల ప్రజాస్పందనలపై మరింత దృష్టి సారిస్తామని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం రాష్ట్ర సచివాలయం నుంచి స్టేట్ ప్రాజెక్ట్ మానిటరింగ్ గ్రూప్, యోగాంధ్ర –2025 క్యాంపెయిన్, ప్రభుత్వ పథకాలు, సేవలపై ప్రజా స్పందనలు, జిల్లా సబ్ ఆర్డినేట్ కోర్టులలో టాయిలెట్స్ కాంప్లెక్స్ వంటి వివిధ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించి తగు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక కలెక్టరేట్ బోర్డు మీటింగ్ హాలు నుంచి జిల్లా కలెక్టర్‌తోపాటు జేసీ అదితిసింగ్, డీఆర్వో విశ్వేశ్వర నాయుడు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సీఎస్ వీసీలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని పెద్దముడియం మండల సోలార్ ప్రాజెక్టుకు సంబంధించి రెవెన్యూ భూముల సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీవో హాజరతయ్య, ఆర్‌అండ్‌బీఎస్ ఈ.చంద్ర శేఖర్, జిల్లా పర్యాటక అధికారి సురేష్, తదితర అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి