తహసీల్దార్‌కు షోకాజ్‌ నోటీసు | - | Sakshi
Sakshi News home page

తహసీల్దార్‌కు షోకాజ్‌ నోటీసు

Jun 15 2024 1:02 AM | Updated on Jun 15 2024 1:02 AM

జమ్మలమడుగు : స్థానిక తహసీల్దార్‌ కరుణాకర్‌కు ఆర్డీఓ శ్రీనివాస్‌ షోకాజ్‌ నోటీసు జారీ చేశారు. ఎన్నికల కమిషన్‌ ఇచ్చిన నిధుల వ్యయంపై నివేదిక ఇ వ్వాలని అందులో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎన్నికల నిర్వహణ ఖ ర్చుల కోసం ఎన్నికల సంఘం కోటి అరవై లక్షల రూ పాయల నిధులు విడుదల చేసింది. అయితే అధికారులు ఎన్నికలకు సంబంధించిన ఖర్చుపై ఇంత వరకు ఉన్నత స్థాయి అధికారులకు నివేదిక ఇవ్వకపోవడంతో కింది స్థాయి సిబ్బంది పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా డీటీగా పని చేస్తున్న వేణుగోపాల్‌.. వీఆర్‌ఏలపై అనుచితంగా ప్రవర్తించడంతోపాటు ‘మీకు రోజుకు వంద రూపాయల వంతున ఉన్నతాధికారులు ఇవ్వమన్నారు. వీఆర్‌ఏకు ఆరు వేల రూపాయలు మాత్రమే వచ్చింది. ఇంతకంటే ఎక్కువ మీకు ఇచ్చేది లేదు, ఎన్నికలు అయిపోయాయి, మీరు ఎలా విధులు నిర్వహిస్తారో మేము చూస్తాం’ అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడంటూ వీఆర్‌ఏల సంఘం అధ్యక్షుడు ఫెడ్రిక్‌ రాజు వాపోయారు. ‘మాకు టీఏ, డీఏలతోపాటు అన్నం ఖర్చులకు రోజుకు 250 రూపాయల వంతున ఇస్తామని ఎన్నికల నిబంధనలలో ఉంది. దాదాపు 60 రోజుల పాటు 20 మంది వీఆర్‌ఏలు ఎర్రగుంట్ల మండలంలో వీడియో గ్రాఫర్లుగా విధులు నిర్వహించారు. రోజూ జమ్మలమడుగు నుంచి వెళ్లి అక్కడ విధులు నిర్వహించాం. మాకు 15 వేల రూపాయల వరకు రావాల్సి ఉంది. అయితే కేవలం ఆరువేల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకొన్నారు’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అదే విధంగా డీటీగా పని చేస్తున్న వరద కిశోర్‌కుమార్‌రెడ్డి తాను ఎన్నికల విధులు నిర్వహించినా తన పేరు ఎక్కడా లేదని, పైగా వేణుగోపాల్‌ బెదిరింపులకు పాల్పడుతున్నాడని వాపోయారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని న్యాయం చేయాలని వారు కోరారు.

30 లక్షల వరకు అవినీతి జరిగిందని ఆరోపణలు

ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడినప్పటి నుంచి రోజూ సిబ్బందికి మధ్యాహ్నం భోజనం వివిధ సౌకర్యాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఎన్నికల విధుల నిర్వహణ కోసం వచ్చిన ఉద్యోగులకు వారి ఖర్చులకు డబ్బులు ఇవ్వాల్సి ఉంది. అయితే ఎన్నికల ఖర్చులు చూసే అధికారులు మాత్రం కింది స్థాయి సిబ్బందికి ఎటువంటి భోజనాలు పెట్టకున్నా, వారికి ఖర్చులకు డబ్బులు ఇవ్వకున్నా ఇచ్చినట్లు రాసుకున్నారని బాధితులు వాపోతున్నారు. దాదాపు 30 లక్షల రూపాయల వరకు అవినీతి జరిగినట్లు సిబ్బంది వాపోతున్నారు.

ఖర్చుల వివరాలు ఉన్నతాధికారులకు

సమర్పించాలన్నాం

ఎన్నికల కమిషన్‌ ఇచ్చిన నిధులపై సమగ్ర నివేదికతోపాటు ఖర్చు వివరాలను సమర్పించా లని ఈ నెల 3న తహసీల్దార్‌కు షోకాజ్‌ నోటీసులు ఇచ్చాం. అవినీ తి జరిగి ఉంటే చర్యలు తీసుకుంటాం. తమకు డబ్బు లు ఇవ్వలేదని ఏ వీఆర్‌ఏ కూడా నా దృష్టికి తీసుకుని రాలేదు. – శ్రీనివాస్‌, ఆర్డీఓ, జమ్మలమడుగు

ఎన్నికల ఖర్చుపై నివేదిక ఇవ్వాలని ఆదేశం

తమకు అన్నం కూడా పెట్టలేదంటున్న వీఆర్‌ఏలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement