
గంజికుంట నాగలక్ష్మి (37) అనే మహిళ ఈ నెల 26వ తేదీ నుండి కనిపించడం లేదని భర్త వేణు గోపాల్
మైలవరం (జమ్మలమడుగు రూరల్): మైలవరం మండలం వేపరాల గ్రామానికి చెందిన గంజికుంట నాగలక్ష్మి (37) అనే మహిళ ఈ నెల 26వ తేదీ నుండి కనిపించడం లేదని భర్త వేణు గోపాల్ బుధవారం మైలవరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేశాడు. ఆమె మానసిక పరిస్థితి సరిగా లేదని ఆయన తెలిపారు. వేణుగోపాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ రామకృష్ణ తెలిపారు.