
మానవ వనరుల అభివృద్ధే లక్ష్యం
ఆలేరు: పారిశ్రామిక అవసరాలకు నుగుణంగా మానవ వనరులను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, ఇందుకు ఐటీఐలను ఏటీసీలుగా అప్‌గ్రేడ్ చేసినట్టు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. శనివారం సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌లో వర్చువల్‌గా అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ)లను ప్రారంభించారు. ఆలేరులో ప్రభుత్వ విప్ ఐలయ్య ఏటీసీని ప్రారంభించి మాట్లాడారు. ఏటీసీల ద్వారా గ్రామీణ యువతకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తీసుకురావడానికే సీఎం ధ్యేయమన్నారు. ఆలేరు ఐటీఐ ప్రిన్సిపాల్ హరికృష్ణ మాట్లాడుతూ ఏటీసీని భవిష్యత్‌లో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌గా మా ర్చడానికి చొరవ చూపాలని ఎమ్మెల్యేను కోరారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు, రాష్ట్ర మహిళా అభివృద్ధి కార్పొరేషన్ చైర్‌పర్సన్ బండ్రు శోభారాణి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్,మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ చైతన్యరెడ్డి, కాంగ్రెస్ నాయకులు జనగాం ఉపేందర్‌రెడ్డి, విజయ్‌కుమార్, ఇజాజ్, వెంకటస్వామి , రాజశేఖర్‌గౌడ్, విద్యార్థులు పలు శాఖ అధికారులు పాల్గొన్నారు.
ఫ ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య