
యాదగిరి క్షేత్రంలో సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో గురువారం సంప్రదాయ పూజలు శాస్త్రోక్తంగా చేపట్టారు.వేకువజామున స్వామివారి మేల్కొలుపులో భాగంగా సుప్రభాతం సేపట్టిన అర్చకులు.. గర్భాలయంలోని స్వయంభూలు, సువర్ణ ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభేషికం, తులసీదళ అర్చనతో కొలిచారు. అనంతరం ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహహోమం ఆగమశాస్త్రం ప్రకారం నిర్వహించారు. ఆ తరువాత గజవాహన సేవ, స్వామి, అమ్మవారి నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, ముఖ మండపంలో సువర్ణ అష్టోత్తర తదితర కై ంకర్యాలు గావించారు. సాయంత్రం వేళ వెండి జోడు సేవలను ఊరేగించారు. వివిధ పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి శయనోత్సవం చేసి ఆలయ ద్వారబంధనం చేశారు.