మోటార్‌సైకిళ్ల చోరీ కేసులో ముగ్గురి అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

మోటార్‌సైకిళ్ల చోరీ కేసులో ముగ్గురి అరెస్ట్‌

Oct 28 2025 8:18 AM | Updated on Oct 28 2025 8:18 AM

మోటార్‌సైకిళ్ల చోరీ కేసులో ముగ్గురి అరెస్ట్‌

మోటార్‌సైకిళ్ల చోరీ కేసులో ముగ్గురి అరెస్ట్‌

మోటార్‌సైకిళ్ల చోరీ కేసులో ముగ్గురి అరెస్ట్‌ మహిళ నిర్బంధం కేసులో నిందితుడికి రిమాండ్‌

ముదినేపల్లి రూరల్‌: మోటారు సైకిళ్లు చోరీ చేస్తున్న ముగ్గురిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వీరిలో ఒక మైనర్‌ ఉన్నాడు. స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో కై కలూరు రూరల్‌ సీఐ వి రవికుమార్‌, ఎస్సై వీఎస్‌ వీరభద్రరావు వివరాలు వెల్లడించారు. వాహనాల తనిఖీల్లో భాగంగా సోమవారం ఉదయం దేవపూడి వద్ద తనిఖీలు చేస్తుండగా కొచ్చెర్ల వైపు నుంచి ముగ్గురు వ్యక్తులు మోటారుబైక్‌పై అనుమానాస్పదంగా సంచరిస్తుండగా వారిని అదుపులోకి తీసుకుని విచారించామన్నారు. నిందితులు విజయవాడకు చెందిన జలసూత్రం సాయిసురేష్‌కుమార్‌, మండలంలోని ప్రొద్దువాకకు చెందిన యండూరి జీవరాజు, విజయవాడకు చెందిన మరో మైనర్‌ కొంతకాలంగా మండలంతో పాటు విజయవాడ, కై కలూరు, కలిదిండి మండలాలతోపాటు తాడేపల్లి, దేవపూడి, ముదినేపల్లి ప్రాంతాల్లో 18 మోటారుబైక్‌లు, ఒక మొబైల్‌ఫోను దొంగతనం చేశారన్నారు. వీటి విలువ రూ.10లక్షలు పైగా ఉంటుందని చెప్పారు. దొంగిలించిన వాహనాలను మండలంలోని ప్రొద్దువాకకు చెందిన కుర్మా సుధాకర్‌ వద్ద దాచిపెట్టగా వీటిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులను అరెస్టు చేయడంలో కీలకపాత్ర పోషించిన కానిస్టేబుళ్లు బి నాగబాబు, పి పవన్‌కుమార్‌, జి శివకోటయ్య, వై నాగరాజును సీఐ, ఎస్సై అభినందించారు.

భీమడోలు: మహిళ నిర్బంధం కేసులో నిందితుడు కటారి మోహన్‌ నాగ వెంకట సాయిని కోర్టులో హాజరుపర్చగా రిమాండ్‌ విధించినట్లు ఎస్సై షేక్‌ మదీనాబాషా తెలిపారు. వివరాల ప్రకారం భీమడోలు గ్రామానికి చెందిన గుండుమోలు సుధాకర్‌, భానుపూర్ణిమ దంపతులు. నిందితుడు కటారి మోహన్‌ నాగ వెంకట సాయి భానుపూర్ణిమకు మాయమాటలు చెప్పి 15 రోజులపాటు గ్రామాంతరం తీసుకువెళ్లగా ఆమె తన కుటుంబ సభ్యుల కోసం గొడవ చేయడంతో ఈనెల 19న భీమడోలు తీసుకువచ్చాడు. అనంతరం తీవ్ర మనోవేదన, అవమానభారంతో సూసైడ్‌ నోట్‌ రాసి భార్యభర్తలు సుధాకర్‌, భానుపూర్ణిమ కూల్‌డ్రింక్‌లో పురుగు మందు కలుపుకుని తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ప్రస్తుతం వారు గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ కేసుకు సంబంధించి ఈనెల 7వ తేదీన గుండుమోలు సుధాకర్‌ ఫిర్యాదు మేరకు భీమడోలులో మహిళా అదృశ్యం కేసు నమోదు చేశారు. అయితే భానుపూర్ణిమ గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇచ్చిన వాంగ్మూలం మేరకు మహిళ అదృశ్యం విభాగం నుంచి పరాయి సీ్త్ర నిర్బంధం, ఇతర సెక్షన్ల కింద మార్పు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసులో జిల్లా ఎస్పీ కేపీఎస్‌ కి షోర్‌, డీఎస్పీ శ్రావణ్‌కుమార్‌ ఆదేశాల మేరకు సీఐ యూజే విల్సన్‌, ఎస్సై మదీనా బాషా నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేశారు. నిందితుడు కటారి మోహన్‌ నాగ వెంకట సాయిను భీమడోలు పోలీసులు అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి 14 రోజుల పాటు రిమాండ్‌ విధించినట్లు ఎస్సై మదీనా బాషా తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement