పాపికొండల బోటు ప్రయాణం రద్దు
బుట్టాయగూడెం: పాపికొండల బోటు ప్రయాణాలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. మూడు నెలలుగా నిలిచిపోయిన పాపికొండల బోటు ప్రయాణాలు ఈ నెల 12వ తేదీన ప్రారంభమయ్యాయి. కార్తీక మాసం కావడంతో పర్యాటకులు కూడా అధిక సంఖ్యలో పాపికొండల విహారయాత్రకు బయల్దేరి వెళ్తున్నారు. అయితే మోంథా తుపాను ప్రభావంతో దేవీపట్నం మండల గండిపోచమ్మ రోడ్డు పాయింట్ నుంచి పర్యాటక బోటు సర్వీస్‌లను తాత్కాలికంగా నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు.
గుబ్బల మంగమ్మతల్లి దర్శనం నిలిపివేత
బుట్టాయగూడెం: మోంథా తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున బుట్టాయగూడెం మండలం కామవరం అటవీప్రాంతంలో కొలువై ఉన్న గుబ్బల మంగమ్మ తల్లి దర్శనాలను ఆలయ కమిటీవారు నిలిపివేశారు. వాతావరణం చక్కబడి పరిస్థితులు అనుకూలించిన తర్వాత మళ్లీ దర్శనాల తేదీలు ప్రకటిస్తామని ఆలయ కమిటీ ప్రతినిధులు కోర్సా గంగరాజు, కోర్సా రాంబాబు తెలిపారు. అప్పటివరకూ మంగమ్మతల్లి దర్శనానికి భక్తులెవ్వరూ రావొద్దని వారు విజ్ఞప్తి చేశారు.


