
అంతర పంటలపై ఆసక్తి
చింతలపూడి: నియోజకవర్గంలో రైతులు అంతర పంటలపై ఎక్కువగా మక్కువ చూపుతున్నారు. ఏటా అతివృష్టి లేదా అనావృష్టితో ఒక పంటకు నష్టం వాటిల్లినా మోరో పంట ఆదుకుంటుందన్న ఆశతో ఖర్చుకు వెనుకాడకుండా అంతర పంటలను సాగు చేస్తూ నిరంతర లాభాలను సాధిస్తున్నారు. అంతేకాక పెరుగుతున్న ఎరువులు, పురుగుమందులు, సాగు పెట్టుబడులతో గిట్టుబాటు ధర లభించక మరింత ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు వాణిజ్య పంటలతో పాటు అంతర పంటలపై మొగ్గు చూపుతున్నారు. మెట్ట ప్రాంతంలో సుమారు 10 వేల ఎకరాలకు పైగానే రైతులు అంతర పంటలు సాగు చేస్తున్నట్లు అంచనా. అంతర పంటల్లో భాగంగా కొబ్బరిలో కోకో, అరటి, వక్క, ఆయిల్‌పాం తోటల్లో వేరుశెనగ, మొక్కజొన్న, మామిడిలో మొక్కజొన్న సాగు, ఏకకాలంలో రెండు, మూడు రకాల కూరగాయల సాగు చేస్తున్నారు.
అంతర పంటల సాగు వల్ల వాణిజ్య పంటల సాగులో పెట్టుబడులను అంతర పంటల ద్వారా రైతులు సమకూర్చుకుంటున్నారు. దీనివల్ల కూలీల కొరతను అధిగమించడమే కాకుండ ఎరువులు, పురుగు వుందులు వాడినప్పుడు ఖర్చు తగ్గుముఖం పట్టినట్లు రైతులు చెబుతున్నారు. తక్కువ నీటితో ఎక్కువ పంటలను పండించే వీలు కలుగుతుందని చెబుతున్నారు. ప్రభుత్వాలు కూడ అంతర పంటల వైపు రైతులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. రైతులకు ప్రత్యేక రాయితీలు, రుణాలు అందించి అంతర పంటల సాగు పెరగడానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
పాడి–పంట

అంతర పంటలపై ఆసక్తి

అంతర పంటలపై ఆసక్తి

అంతర పంటలపై ఆసక్తి