
అనుమానాస్పద స్థితిలో విద్యార్థి మృతి
ముసునూరు: గత రెండు రోజులుగా అదృశ్యమైన ఇంటర్ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ముసునూరు ఎస్సై ఎ చిరంజీవి కథనం మేరకు మండలంలోని లోపూడి గ్రామానికి చెందిన బిలుగుది గోపాలరావు కుమారుడు చందూ(17) పదో తరగతి పాస్ అయ్యాడు. ఇటీవల ధర్మాజీగూడెంలోని ఓ ప్రైవేటు కాలేజీలో చేరగా కొద్ది రోజుల క్రితం అతని స్నేహితులు ఏలూరులో చదువుతున్నట్లు తెలుసుకుని అక్కడ కాలేజీలో చేర్చారు. అనంతరం తమ సమీప బంధువుల కుమార్తె ఎన్‌టీఆర్ జిల్లా విస్సన్నపేటలో చదువుతున్న విషయం తెలుసుకుని అక్కడ కాలేజీలో చేర్చారు. ఈ నేపథ్యంలో శుక్రవారం కళాశాలలో ఇంటికి వెళ్తున్నట్లు చెప్పి కొండపర్వలోని తన బంధువుల ఇంటికి వెళ్లి ఆదివారం వరకు అక్కడే ఉన్నాడు. సోమవారం కాలేజీకి బయలుదేరాడు. కాని అటు వెళ్లకుండా అమ్మమ్మ వాళ్ల గ్రామం రమణక్కపేట చేరుకున్నాడు. అక్కడ నుంచి సాయంత్రం వరకు చెక్కపల్లి, ధర్మాజీగూడెం గ్రామాల్లో సంచరించి రాత్రి 7 గంటలకు లోపూడి చేరుకుని అదృశ్యమయ్యాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు బంధువుల గ్రామాల్లో గాలించినా చందూ ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో సామవారం సాయంత్రం ముసునూరు పోలీసులను ఆశ్రయించారు. కాగా బుధవారం తమ ఇంటి సమీపంలో ఉన్న ఖాళీ ఇంటిలోని టాయిలెట్‌లో విద్యార్థి ఉరి వేసుకుని మృతి చెంది ఉండడాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.