
క్షీరారామంలో రుద్రహోమం
పాలకొల్లు సెంట్రల్: స్థానిక శ్రీ క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో మాసశివరాత్రి సందర్భంగా బుధవారం రుద్రహోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 12 మంది దంపతులు పాల్గొని స్వామివారికి అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. ఆలయ అభిషేక పండిట్ భమిడపాటి వెంకన్న బ్రహ్మత్వంలో పూజా కార్యక్రమాలు జరిపారు. హోమం అనంతరం భక్తులను స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి ప్రసాదాలు అందజేశారు. ఆలయ సూపరింటెండెంట్ పి వాసు, అర్చకులు వీరబాబు తదితరులు పాల్గొన్నారు.
శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యం
పోలవరం రూరల్: పోలవరంలో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ భవనాన్ని బుధవారం హోం మంత్రి వంగలపూడి అనిత బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అభివృద్ధి వేగంగా సాగాలంటే శాంతిభద్రతల పర్యవేక్షణ అత్యంత ముఖ్యమైనదన్నారు. పోలీసు వ్యవస్థ బలోపేతానికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడమే ఈ భవనాల నిర్మాణ లక్ష్యమన్నారు. పోలీస్‌స్టేషన్ ఆవరణ మొత్తం ఆమె పరిశీలించి వివరాలను డీఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు నుంచి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, ట్రైకార్ ఛైర్మన్ బొరగం శ్రీనివాసులు, ఏలూరు రేంజ్ ఐజీ అశోక్‌కుమార్, ఎస్పీ కేపీఎస్ కిషోర్, సీఐ బాల సురేష్, ఎస్సై ఎస్‌ఎస్ పవన్‌కుమార్ పాల్గొన్నారు.
‘ఓ రోజు శాస్త్రవేత్త అవుతారా’లో ఏలూరు విద్యార్థి
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దేశవ్యాప్తంగా 37 ప్రయోగశాలలో నిర్వహిస్తున్న ‘ఓ రోజు శాస్త్రవేత్త అవుతారా’ కార్యక్రమానికి ఏలూరు వెన్నవల్లి వారిపేటలోని సెయింట్ జోన్స్ హైస్కూల్ ఎనిమిదో తరగతి విద్యార్థి తంజంగారి భార్గవ్ సాయి హనుమ సీఎస్‌ఐఆర్ చైన్నె కేంద్రానికి ఎంపికయ్యాడు. బుధవారం చైన్నె అడయార్‌లోని సీఎస్‌ఐఆర్ కేంద్రంలో దక్షిణ భారత వ్యాప్తంగా విచ్చేసిన 75 మంది విద్యార్థులతో శాస్త్రవేత్తలతో పలు అంశాలకు సంబంధించిన విషయాలు తెలుసుకొని, వారిలో కలిగే ప్రశ్నలకు జవాబులు, సైన్స్ ల్యాబ్‌లో జరిగే ఎన్నో పరిశోధనలను పరిశీలించే కార్యక్రమంలో పాల్గొన్నాడు. విద్యార్థులకు నిర్వాహకులు సర్టిఫికెట్లు అందించారు.

క్షీరారామంలో రుద్రహోమం

క్షీరారామంలో రుద్రహోమం