
అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు
పెనుగొండ: ఉండి నియోజకవర్గంలో దళితులు నివసిస్తున్న ఇళ్లను అక్రమంగా కూల్చివేయడం దారుణమని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నన్నేటి పుష్పరాజ్ విమర్శించారు. శనివారం ఆచంట వేమవరంలోని మాల మహానాడు కార్యాలయంలో పోలీసులు గృహ నిర్బంధ చేశారు. ఆకివీడు మండలం ధర్మవరం అగ్రహారంలో దళితులకు అండగా పోరాటం చేస్తామని పోలీసులు అరెస్ట్ చేశారన్నారు. ఉద్యమాలను అరెస్ట్‌లతో ఆపలేరన్నారు. దళితులు నివాసాలు రహదారికి ఎలాంటి ఇబ్బంది లేకపోయినా తొలగించడానికి సన్నాహాలు చేస్తున్నారన్నారు. వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇచ్చిన హామీ ప్రకారం ఇబ్బంది కలుగుకుండా చర్యలు తీసుకోవాలన్నారు. లేకుంటే మాలమహానాడు ఆధ్వర్యంలో భారీ స్థాయిలో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.