ఖైదీల సౌకర్యాలపై ప్రతి నెలా తనిఖీలు | - | Sakshi
Sakshi News home page

ఖైదీల సౌకర్యాలపై ప్రతి నెలా తనిఖీలు

Jun 25 2025 1:13 AM | Updated on Jun 25 2025 1:13 AM

ఖైదీల సౌకర్యాలపై ప్రతి నెలా తనిఖీలు

ఖైదీల సౌకర్యాలపై ప్రతి నెలా తనిఖీలు

ఏలూరు టౌన్‌: ఏలూరు జిల్లా జైలును ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్‌, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్‌.శ్రీదేవి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కే.రత్నప్రసాద్‌ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీదేవి మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి కారాగారాన్ని జిల్లా న్యాయసేవాధికార సంస్థ తనిఖీలు నిర్వహించాల్సి ఉందన్నారు. ప్రతి నెలా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఆధ్వర్యంలో తనిఖీలు ఉంటాయని, మూడు నెలలకు ఒకసారి జిల్లా చైర్మన్‌ తనిఖీలు చేస్తారని స్పష్టం చేశారు. జిల్లా జైలులోని ఖైదీల వివరాలు తెలుసుకుని, ఉచిత న్యాయ సహాయం ఏర్పాటు చేస్తామన్నారు. ఖైదీల కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను పొందడంలో సమస్యలు ఏర్పడితే జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఉచితంగా అందిస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా జైలు సూపరింటెండెంట్‌ సీహెచ్‌ఆర్‌వీ స్వామి, జైలర్‌ కే.శ్రీనివాసరావు, చీఫ్‌ లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిలర్‌ పీవీఎన్‌. మునీశ్వరరావు తదితరులు ఉన్నారు.

జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్‌పర్సన్‌, ప్రధాన న్యాయమూర్తి శ్రీదేవి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement