
కై కలూరు టౌన్ పోలీసు స్టేషన్‌లో అగ్నిప్రమాదం
కై కలూరు: స్థానిక టౌన్ పోలీసు స్టేషన్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంగళవారం అగ్నిప్రమాదం సంభవించింది. ఆరుబయట విద్యుత్ మీటరు నుంచి ఒక్కసారిగా భారీ మంటలు వ్యాపించాయి. ఏం జరుగుతుందో తెలీయక అందరూ ఆయోమయంలో పడ్డారు. మంటలు వ్యాపించిన మీటరు సమీపంలో పదుల సంఖ్యలో ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. మరో వైపున పోలీసుశాఖ నిర్వహిస్తున్న పెట్రోల్ బంకు ఉంది. తేరుకున్న పోలీసులు వెంటనే మంటలను ఆదుపు చేశారు. ప్రమాదం విషయమై విద్యుత్‌శాఖ లైన్‌మెన్ ఆనందరావును వివరణ కోరగా పోల్ నుంచి వచ్చిన మెయిన్ సర్వీసు వైరులో ఎటువంటి ఇబ్బంది లేదన్నారు. ఏసీలు వంటివి అధిక లోడ్ తీసుకుంటే ఇటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. విద్యుత్ మీటరు కాలిపోవడంతో స్టేషన్ అంధకారమైంది. సమీప మీటరు నుంచి తాత్కలికంగా విద్యుత్‌ను పునరుద్ధరించారు.

కై కలూరు టౌన్ పోలీసు స్టేషన్‌లో అగ్నిప్రమాదం