
వ్యాన్‌ను ఢీకొన్న కంటైనర్
దెందులూరు: వ్యాన్‌ను కంటైనర్ లారీ ఢీకొనడంతో ఆరుగురికి స్వల్ప గాయాలయ్యాయి. జాతీయ రహదారిపై దెందులూరు హెచ్‌పీ పెట్రోలు బంకు వద్ద మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. కృష్ణా జిల్లా పామర్రు నుంచి తూర్పుగోదావరి జిల్లా వాడపల్లిలోని శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు ఒకే కుటుంబానికి చెందిన 15 మంది వ్యాన్‌లో వెళ్తున్నారు. దెందులూరు హెచ్‌పీ పెట్రోలు బంకు వద్దకు వచ్చేసరికి గుండుగొలను వైపు వెళ్తున్న కంటైనర్ లారీ వెనుక నుంచి వ్యాన్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో వ్యాన్‌లో ప్రయాణిస్తున్న 15 మందిలో ఆరుగురికి స్వల్ప గాయాలు కాగా మిలిలిన వారు క్షేమంగా బయటపడ్డారు. క్షతగాత్రులను వెంటనే దెందులూరు సీహెచ్‌సీకి 108 అంబులెన్స్‌లో తరలించారు. కాగా వ్యాన్‌ను ఢీకొట్టి వెళ్లిపోయిన కంటైనర్‌ను సత్యనారాయణపురం వద్ద గ్రామస్తులు నిలుపుదల చేసి తాళాలు తీసుకున్నారు. అయితే డ్రైవర్ వద్ద మరో తాళం ఉండడంతో కంటైనర్‌తో పరారయ్యాడని ఎస్సై శివాజి చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు.
ఆరుగురికి స్వల్పగాయాలు

వ్యాన్‌ను ఢీకొన్న కంటైనర్