బతుకు పోరులో.. పీకల్లోతు మురుగులో ! | - | Sakshi
Sakshi News home page

బతుకు పోరులో.. పీకల్లోతు మురుగులో !

May 11 2025 12:30 PM | Updated on May 11 2025 12:30 PM

బతుకు పోరులో.. పీకల్లోతు మురుగులో !

బతుకు పోరులో.. పీకల్లోతు మురుగులో !

బతుకు పోరులో నిజమైన హీరోలు వీరే.. డ్రైనేజీ పక్క నుంచి వెళ్లడానికే మనం చిరాకుపడతాం. రోడ్డుపై మురుగు కనిపిస్తే ఆ చాయలకు వెళ్లేందుకు ఇష్టపడం.. అలాంటిది తీవ్ర దుర్వాసన వెదజల్లే మురుగులో దిగి శుభ్రం చేసే వీరిని చూస్తే బతుకు పోరు ఎంత విచిత్రమో అనిపిస్తుంది. వారు ఒక్క రోజు పనిచేయకపోతే మన జీవనం ఎంత దుర్భరమో.. అందుకు ఈ చిత్రమే నిదర్శనం. ద్వారకాతిరుమలలోని రాణిచిన్నయమ్మారావుపేటలో మురుగుతో నిండిపోయిన డ్రైనేజీని శుభ్రం చేసేందుకు ఓ కార్మికుడు శనివారం అందులో దిగి ఎంతగానో శ్రమించాడు. మురుగు ముందుకు కదలకపోవడంతో పీకల్లోతున మునిగి డ్రైనేజీని శుభ్రం చేశాడు.

– ద్వారకాతిరుమల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement