నేత్రపర్వం.. ఎదుర్కోలు ఉత్సవం | - | Sakshi
Sakshi News home page

నేత్రపర్వం.. ఎదుర్కోలు ఉత్సవం

May 11 2025 12:28 PM | Updated on May 11 2025 12:28 PM

నేత్ర

నేత్రపర్వం.. ఎదుర్కోలు ఉత్సవం

అట్టహాసంగా శ్రీవారి తిరువీధి సేవ

నేడు చిన వెంకన్న కల్యాణోత్సవం

ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చినవెంకన్న వై శాఖ మాస దివ్య బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాల్గో రోజు శనివారం రాత్రి జరిగిన ఎదుర్కోలు ఉత్సవం నేత్రపర్వంగా సాగింది. బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రాధాన్యమున్న ఈ వేడుకను శ్రీవారి కల్యాణోత్సవం ముందు రోజు జరిపించడం ఆనవాయితీ. ముందుగా స్వామి, అమ్మవార్ల కల్యాణ మూర్తుల ను ఆలయం నుంచి తొళక్క వాహనంపై తీసుకువచ్చి నిత్య కల్యాణ మండపంలో వెండి శేష వాహనంపై వేంచేపు చేసి హారతులిచ్చారు. అనంతరం ఎదుర్కోలు ఉత్సవాన్ని ప్రారంభించారు. ఆలయ అధికారులు, అర్చకులు, పండితులు, భక్తులు రెండు జట్లుగా విడిపోయి ఒక జట్టు శ్రీవారి గుణగణాలను, ఆయన విశిష్టతను, రెండో జట్టు అమ్మవార్ల గుణగణాలను కొనియాడారు. వివాహానికి ముందు రోజు వధూవరుల తరఫు బంధువులు శుభలేఖను పఠించేందుకు జరిపే కార్యక్రమమే ఎదుర్కోలు ఉత్సవమని పండితులు తెలిపారు. ఉదయం హనుమద్వాహనంపై శ్రీవారి తిరువీధి సేవ శోభాయ మానంగా సాగింది. ఆలయ ముఖ మండపంలో శ్రీ మురళీ కృష్ణ అలంకారంలో ఉన్న శ్రీవారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించారు. శ్రీహరి కళాతోరణ వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి.

బ్రహ్మోత్సవాల్లో నేడు

● ఉదయం 7 గంటల నుంచి.. సింహ వాహనంపై తిరువీధి సేవ.

● రాత్రి 8 గంటల నుంచి.. శ్రీవారి తిరుకల్యాణ మహోత్సవం, అనంతరం వెండి గరుడ వాహనంపై తిరువీధి సేవ.

శ్రీవారి ప్రత్యేక అలంకారం.. మోహిని

నేత్రపర్వం.. ఎదుర్కోలు ఉత్సవం1
1/1

నేత్రపర్వం.. ఎదుర్కోలు ఉత్సవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement