
దర్యాప్తు వేగంగా పూర్తి చేయాలి
భీమవరం: త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేసి, నేరస్తులకు కఠిన శిక్షలు పడేలా చేయడానికి దర్యాప్తు అధికారులు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి సూచించారు. భీమవరంలో పోలీసు అధికారులకు శ్రీఫోరెన్సిక్ ఎవిడెన్స్ మేనేజ్‌మెంట్ఙ్‌పై ఏర్పాటు చేసిన ఒక రోజు శిక్షణా కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. నార్కోటిక్స్, మత్తు పదార్థాలు, వివిధ రకాల ప్రాణాంతకమైన విషాలు, డీఎన్‌ఏ, రక్త నమూనాలు, మానవ అవయవాలకు సంబంధించిన సాక్ష్యాల సేకరణ, సైబర్ నేరాలలో పాటించవలసిన అంశాలు, ఆడియో, వీడియో, ముఖ్యమైన పత్రాల సేకరణలో పాటించవలసిన మెలకువల గురించి తెలిపారు. సాక్ష్యాధారాలు ఏ విధంగా భద్రపరచాలి, భద్రపరిచిన వాటిని ల్యాబ్‌కు పంపే సమయంలో ఎలా ప్యాకింగ్ చేయాలి అనే అంశాలను వివరించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ(అడ్మిన్) వి. భీమారావు, డీఎస్పీలు ఆర్.జయసూర్య, జి.శ్రీ వేద, డి.విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.