
పేరుకే కూటమి ప్రభుత్వం.. పెత్తనమంతా టీడీపీ నేతలదే.. జనస
జనసేన కార్యాలయంలో టీడీపీ హవా
భీమవరం నియోజకవర్గం నుంచి జనసేన ఎమ్మెల్యేగా గెలుపొందిన పులపర్తి రామాంజనేయులు కార్యాలయంలో టీడీపీ నేతలు హవా సాగిస్తున్నారు. ఎమ్మెల్యే కార్యాలయం కేంద్రంగా టీడీపీ నేతలు కోళ్ళ నాగేశ్వరరావు, పొత్తూరి బాపిరాజులు నియోజకవర్గ వ్యవహారాలు చక్కదిద్దుతున్నారు. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరిని కలిసిన తరువాతే ఎమ్మెల్యేను కలిసేలా సిస్టం సెట్ చేశారు. కొద్ది రోజులు క్రితం మత్స్యపురి గ్రామానికి చెందిన జనసేన నాయకులు ఎమ్మెల్యేను కలవడానికి వస్తే టీడీపీ నేత నాగేశ్వరరావే మాట్లాడటం, దానిపైన మత్స్యపురి గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసి కలవకుండా వెళ్ళిపోయా రు. తరువాత ఎమ్మెల్యే సమాచారం తెలుసుకుని పిలిపించుకుని మాట్లాడారు. టీడీపీ నేతకు సంబంధించిన వ్యవహారంలో చెరువు రైతులకు టీడీపీ నేత బకాయి ఉండటంతో సెటిల్‌మెంట్ చేయడంపైన జనసేనలో అసంతృప్తి ఉంది. నియోజకవర్గంలోని మద్యం షాపులు మొదలుకొని అన్ని వ్యవహారాలు జనసేన ఎమ్మెల్యే పేరుతో టీడీపీ నేతలే చక్కదిద్దడం గమనార్హం.