భీమవరం: అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు మంజూరు చేయాలని కోరుతూ సీపీఐ ఆధ్వర్యంలో ఈనెల 15వ తేదీన జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు తెలిపారు. బుధవారం పట్టణంలోని దుర్గాపురంలో ఇళ్లు లేని పేదలతో ఇంటి స్థలాల అర్జీలు పూర్తిచేయించిన సందర్భంగా భీమారావు మాట్లాడారు. అర్హులైన పేదలకు పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామాల్లో మూడుసెంట్లు ఇళ్ల స్థలాలు ఇస్తామని ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీని తక్షణమే అమలు జరపాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా సమితి సభ్యుడు మల్లుల శ్రీనివాస్, ప్రజానాట్యమండలి నాయకులు ఛాన్ భాషా, మహిళా నాయకులు కొల్లి సుహాసిని, కె మల్లేశ్వరి, పులిదిండి జాన్సీరాణి, గడిమెళ్ళ కాంతామణి, వర్ల కుమారి, గుత్తుల రాణి తదితరులు పాల్గొన్నారు.