
ఆధ్యాత్మికం.. చెంతనే ఆహ్లాదం
శ్రీవారి క్షేత్రంలో పచ్చని గార్డెన్‌లు
ద్వారకాతిరుమల: ఆధ్యాత్మిక క్షేత్రం చిన్నతిరుపతి ఆహ్లాదభరితంగా మారింది. పచ్చని గార్డెన్లతో కళకళలాడుతోంది. రహదారి పక్కన వివిధ ఆకృతుల్లో దర్శనమిస్తున్న మొక్కలు చూపరులకు కనువిందు చేస్తున్నాయి. దాంతో క్షేత్రంలో ఆధ్యాత్మికతతో పాటు, ఆహ్లాదం వెల్లివిరుస్తోంది. కొండపైకి వెళ్లే ఘాట్‌రోడ్డులోని కల్యాణకట్ట వద్ద గోవింద నామంతో గార్డెన్ ఆకర్షణీయంగా ఉంది. ఉగాది మండపం వద్ద గార్డెన్‌లో గెద్ద, జిరాఫీ ఆకారంలో ఉన్న మొక్కలు, కొండపైన జంటగోపురాలు, మాధవ కల్యాణ మండప ముఖ ద్వారాల వద్ద స్వాగతం పలుకుతున్నట్టుగా ఉన్న ఏనుగు ఆకారాలు, సెంట్రల్ పార్కింగ్ ప్రాంతంలో రహదారి పక్కన గోవిందా.. గోవిందా.. ఆకారంలో ఉన్న మొక్కలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. కొండపైన కాటేజీల వద్ద పచ్చని అందాలు, పూల సోయగాలు భక్తుల మదిని దోచుకుంటున్నాయి.

ఆధ్యాత్మికం.. చెంతనే ఆహ్లాదం