అప్రమత్తతతో వ్యవహరిస్తేనే ప్రమాదాల నివారణ | - | Sakshi
Sakshi News home page

అప్రమత్తతతో వ్యవహరిస్తేనే ప్రమాదాల నివారణ

May 5 2026 7:20 AM | Updated on May 5 2026 7:20 AM

ఏడీఈ రవికుమార్‌

సంగెం: విద్యుత్‌ వినియోగదారులు, సిబ్బంది వి ద్యుత్‌ భద్రత సూచనలు పాటిస్తూ అప్రమత్తతతో వ్యవహరిస్తేనే ప్రమాదాలు జరగకుండా రక్షించుకోవచ్చునని ఏడీఈ రవికుమార్‌ అన్నారు. సోమవా రం సంగెం మండలకేంద్రంలో విద్యుత్‌ భద్రత వా రోత్సవాల్లో భాగంగా సిబ్బంది, వినియోగదారులకు విద్యుత్‌ భద్రత–పొదుపుపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలంలో వానలు, ఈదురుగా లులు, ప్రకృతి వైపరిత్యాలు జరిగినపుడు తీగలు తెగిపోవడం, సాగడం, స్తంభాలు విరగడంతో ప్ర మాదాలు పొంచి ఉంటాయని, లైన్‌లపై పని చేస్తున్నపుడు జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. వ్యవసాయబావుల వద్ద రైతులు విద్యుత్‌ సిబ్బందికి తెలియకుండా ట్రాన్స్‌ఫార్మర్లు బంద్‌ చేయడం, ఫీజులు వేసుకోవడం, స్తంభాలు ఎక్కడం వంటి పనులు చేయొద్దన్నారు. విద్యుత్‌ అవసరం లేనపుడు వాడకుండా పొదుపు చేయాలన్నారు. అంతకుముందు విద్యుత్‌ భద్రత వారోత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏఈ నమ్రత, సబ్‌ఇంజనీర్‌ రాజేష్‌, సీనియర్‌ లైన్‌ ఇన్‌స్పెక్టర్‌ చంద్రమౌళి, రాజ్‌కుమార్‌, శ్రీను పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement