ఎంజీఎం సూపరింటెండెంట్ బాధ్యతల స్వీకరణ
ఎంజీఎం: ఎంజీఎం ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా శనివారం ఈఎన్టీ డాక్టర్ హరీశ్ చంద్రారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఎంజీఎంలో వైద్య సేవల లోపాలపై వరుసగా వస్తున్న కథనాలపై ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ దామోదర రాజనర్సింహ ఆగ్రహం వ్యక్తం చేస్తూ సూపరింటెండెంట్ కిశోర్‌పై వేటు వేసిన విషయం తెలిసిందే. ఈక్రమంలో మంచిర్యాల సూపరింటెండెంట్‌గా కొనసాగుతున్న డాక్టర్ హరీశ్‌చంద్రారెడ్డిను ఎంజీఎం సూపరిండెంట్‌గా నియమిస్తూ డీఎంఈ నరేంద్రకుమార్ గత నాలుగు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా ఆయనను ఎంజీఎం ఆర్‌ఎంఓలు వసంత్‌కుమార్, అశ్విన్, శశికుమార్, ఏడీ శ్రీనివాస్ కలిసి అభినందనలు తెలిపారు.


