
ఎన్నికల నిర్వహణలో బీఎల్‌ఓల పాత్ర కీలకం
వర్ధన్నపేట: ఎన్నికల నిర్వహణలో బీఎల్‌ఓల పాత్ర చాలా కీలకమని జిల్లా ఎలక్టోరల్ ఆఫీసర్, ఆర్‌డీఓ సత్యపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో వర్ధన్నపేట నియోజకవర్గం పరిధిలోని వర్ధన్నపేట మండల బూత్ లెవెల్ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యపాల్‌రెడ్డి మా ట్లాడుతూ బీఎల్‌ఓలు బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని తెలిపారు.శిక్షణలో నేర్చుకున్న అంశాలను సక్రమంగా నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ విజయ్‌సాగర్, నాయక్ తహసీల్దార్ షేక్ అనీఫ్ పాషా, ట్రైనర్లు ఏవీఆర్ చార్యులు, మనుజేందర్‌రెడ్డి, బీఎల్‌ఓలు పాల్గొన్నారు.