విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి

Jul 4 2025 3:29 AM | Updated on Jul 4 2025 3:29 AM

విషయ

విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి

దుగ్గొండి: గ్రామాల్లో బూత్‌ లెవల్‌ అధికారులు (బీఎల్‌ఓలు) ఓటర్ల నమోదు, చనిపోయిన ఓటర్ల తొలగింపు, తప్పులు సరిచేయడం వంటి వాటిపై విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని నర్సంపేట ఆర్డీఓ ఉమారాణి అన్నారు. మండల కేంద్రంలో గురువారం జరిగిన బీఎల్‌ఓల ఒకరోజు శిక్షణ శిబిరంలో ఆమె మాట్లాడా రు. ఓటర్ల నమోదు కోసం అందించే దరఖాస్తులు, తప్పులు సరిచేసుకోవడం, చిరునామా మార్చుకోవడం వంటి విషయాలపై వివరించారు. గ్రామాలలో 18 ఏళ్లు నిండిన యువతీ యువకులను ఓటర్లుగా నమోదు చేయించాల్సిన బాధ్యత బీఎల్‌ఓలదేనని గుర్తు చేశారు. ఎన్నికల వేళ బీఎల్‌ఓలు రాజకీయాలకు అతీ తంగా వ్యవహరించాలని సూచించారు. తహసీల్దార్‌ రాజేశ్వర్‌రావు, డీటీ ఉమ, ఆర్‌ఐలు రాంబాబు, మల్లయ్య, రెవెన్యూ సిబ్బంది, బీఎల్‌ఓలు పాల్గొన్నారు.

రోగనిర్ధారణ పరీక్షల

లక్ష్యాన్ని అధిగమించాలి

న్యూశాయంపేట: రోగ నిర్ధారణ పరీక్షల లక్ష్యాన్ని అధిగమించాలని భారత ప్రభుత్వ ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ అదనపు కా ర్యదర్శి అరుంధతి పట్నాయక్‌ అన్నారు. టీబీ ముక్త్‌ భారత్‌ అభియాన్‌ 100 రోజుల ఇంటెన్సిఫైడ్‌ క్యాంపెయిన్‌పై గురువారం ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. జి ల్లా నుంచి కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద పాల్గొని మాట్లాడుతూ జిల్లాలో 8రకాల వ్యాధులకు సంబంధించి 2,04,979 మంది రోగులు ఉన్నారని తెలిపారు.వారిలో 3,794 మందికి జూన్‌ 3 నుంచి రెండో విడత టీబీ, 8 రకాల వ్యాధుల నిర్మూలనకు వైద్య, ఆరోగ్య శాఖ కృషిచేస్తోందని తెలి పారు. టీబీ రహిత జిల్లాగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె వివరించారు. అదనపు కలెక్టర్‌ సంధ్యారాణి, డీఎంహెచ్‌ఓ సాంబశివరావు, అధికారులు పాల్గొన్నారు.

నేడు శ్రీరుద్రేశ్వరస్వామికి

శతఘటాభిషేకం

హన్మకొండ కల్చరల్‌: వేయిస్తంభాల దేవాలయంలో శుక్రవారం ఉదయం శ్రీరుద్రేశ్వరస్వామి వారికి శతఘటాభిషేకం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈఓ ధరణికోట అనిల్‌కుమార్‌, ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో వర్షాలు కురవాలని, పాడిపంటల సమృద్ధి పండాలని, భూ గర్భజలాలు నిండుగా ఉండాలనే సంకల్పంతో రుష్యశృంగపూజ 60వారుణానువాకా లుతో శ్రీ రుద్రేశ్వరుడికి శతఘటాభిషేకం నిర్వహిస్తున్న ట్లు పేర్కొన్నారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదాల వితరణ ఉంటుందని తెలిపారు.

పిచ్చికుక్క దాడిలో

ముగ్గురికి గాయాలు

ఖానాపురం: పిచ్చికుక్క దాడిలో ముగ్గురికి గాయాలైన సంఘటన మండల కేంద్రంలో గురువారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన శ్రీరాములు, స్రవంతి, సురేశ్‌ తమ ఇళ్లలో పనులు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో పిచ్చికుక్క వారిపై దాడిచేసి గాయపర్చింది. దీంతో మండల కేంద్రంలోని పీహెచ్‌సీకి వెళ్లి వైద్యచికిత్స చేయించుకున్నారు.

నిధులు విడుదల

చేయాలని లేఖ!

కాళేశ్వరం: కాళేశ్వరాలయ అభివృద్ధికి రూ. 200కోట్ల నిధులు విడుదల చేయాలని మంత్రి శ్రీధర్‌బాబు లేఖ రాసినట్లు ఆలయవర్గాల ద్వారా తెలిసింది. కాళేశ్వరంలో మే 15నుంచి 26వరకు సరస్వతీ నది పుష్కరాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ పుష్కరాల మొదటిరోజు ప్రారంభ కార్యక్రమానికి హాజరైన ము ఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాళేశ్వరాలయం అభివృద్ధికి రూ.200కోట్లు మంజూరు చేస్తానని సీఎం సభాముఖంగా హామీ ఇచ్చిన విషయం తెలి సిందే. 2027 జూలైలో జరిగే గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకొని ఇటీవల మంత్రి శ్రీధర్‌బాబు కాళేశ్వరాలయ అభివృద్ధికి రూ. 200కోట్ల నిధులు విడుదల చేయాలని లేఖ రాసినట్లు తెలిసింది. త్వరలో నిధులు విడుదలు అవుతాయని ఆలయ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే గోదావరి తీరం నుంచి ఆలయ పరిసరాల్లో భూసేకరణపై పలు సర్వేనంబర్ల వారీగా సర్వే కూడా చేపట్టారు. అభివృద్ధి పనుల్లో ముఖ్యంగా రోడ్లు విస్తరణ, శాశ్వత నిర్మాణాలు చేపట్టనున్నారు.

విషయ పరిజ్ఞానాన్ని  పెంపొందించుకోవాలి1
1/1

విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement