
ఇబ్బందులు పడాల్సిందే..
వర్షం పడిందంటే పాకాల రోడ్డు నుంచి ఈ కాలనీకి వెళ్లాంటే ఇబ్బందులు పడాల్సిందే. వరదనీరు అంతా ఈ కాలనీకి వచ్చి చేరుతుంది. వరద వెళ్లిపోయాక సీసీ రోడ్డు మొత్తం బురదమయంగా మారుతుంది. దీంతో ఈ రోడ్డు నుంచి నడవాలంటే తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
– కేతావత్ వెంకన్న, పాకాల రోడ్డు, నర్సంపేట
వర్షాకాలం నరకమే..
వర్షాకాలం వచ్చిందంటే కాలనీ వాసులకు నరకమే కనిపిస్తుంది. చిన్నపాటి వానకే వరద నీరు వచ్చి చేరుతుండడంతో కాలనీలోని సీసీ రోడ్డు అంతా జలమయమై ఇబ్బందులు పడాల్సి వస్తోంది. దీంతో కాలనీ మొత్తం దుర్గంధం వెదజల్లుతోంది. దీంతో దోమలు, ఈగలు వ్యాప్తి చెంది ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. – రాంబాబు,
మహబూబాబాద్ క్రాస్‌రోడ్డు, నర్సంపేట
●

ఇబ్బందులు పడాల్సిందే..