
పశువులకు టీకాలు వేయించాలి
వర్ధన్నపేట/రాయపర్తి: పశువులకు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు క్రమం తప్పకుండా వేయించాలని రాష్ట్ర వెటర్నరీ బయోలాజికల్ రీసెర్చ్ ఏడీఏ డాక్టర్ విజయప్రవీణ సూచించారు. వర్ధన్నపేట పట్టణ పరిఽధిలోని జగ్గుపేట భారత్ గోశాల, రాయపర్తి మండల కేంద్రంలోని పశువైద్యశాలలో శుక్రవారం పశువులకు టీకాలు వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ప్రతి 6 నెలలకు ఒకసారి గాలి కుంటు వ్యాధి నిరోధక టీకాలు వేయించాలని, టీకా కార్యక్రమం ఈనెల 15 వరకు కొనసాగుతుందని వివరించారు. కార్యక్రమంలో జిలా పశువైద్యాధికారి బాలకృష్ణ, యానిమల్ డిసీజ్ డయాగ్నోస్టిక్ ల్యాబ్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ నాగమణి, వర్ధన్నపేట ఏడీ డాక్టర్ వెంకటేశ్వర్లు, మండల పశువైద్యాధికారులు శ్రుతి, రాజేందర్, సిబ్బంది మక్బూల్, వెంకటయ్య, సుమన్‌జిత్ర, గణేశ్, కపిల్, రైతులు పాల్గొన్నారు.