
సమావేశంలో మాట్లాడుతున్న ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండా శ్రీనివాస్
శాయంపేట : దళితబంధు పథకంతో దళిత కుటుంబాలు ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నాయని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండా శ్రీనివాస్ అన్నారు. మండలంలోని మైలారం గ్రామంలో బుధవారం ఎస్సీ కార్పొరేషన్ పథకాలపై ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. కరోనా సమయంలో కూడా సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేశారని తెలిపారు. గతంలో దళితులు సమాజంలో గౌరంగా బతికే పరిస్థితి లేదని, దానిని గుర్తించిన సీఎం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు అందిస్తూ ఆదుకుంటున్నారన్నారు. దళితబంధు, వివిధ పథకాల ద్వారా దళితులు కూడా వృత్తిలో ప్రాధాన్యత ఉన్న వాటిని ఎంచుకోని జీవనోపాధి పొందాలని సూచించారు. సర్పంచ్ అరికిల్ల ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సదస్సులో వరంగల్ జెడ్పీ చైర్‌పర్సన్ గండ్ర జ్యోతి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మాధవి, బీఆర్‌ఎస్ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు బీరెల్లి రజని, ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు గంగుల మనోహర్‌రెడ్డి, ఎంపీటీసీ గడిపె విజయ్‌కుమార్, ఉపసర్పంచ్ సునీత సాంబరెడ్డి, ఎంపీడీఓ ఆమంచ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్
బండా శ్రీనివాస్