
కంటి పరీక్షలు చేయించుకుంటున్న కలెక్టర్ సిక్తా పట్నాయక్
కలెక్టర్ సిక్తా పట్నాయక్
హన్మకొండ: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, ఉచిత కంటి పరీక్షలు చేయించుకోవాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. బుధవారం టీఎన్జీవోస్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్‌లోని ఆ యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కంటి పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులతో సహా కంటి పరీక్షలు చేయించుకోవాలన్నారు. టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్ మాట్లాడుతూ అంధత్వ రహిత తెలంగాణ లక్ష్యంగా సీఎం కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ సాంబశివరావు, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాజశేఖర్, టీఎన్జీవోస్ యూనియన్ జిల్లా కార్యదర్శి బైరి సోమయ్య, నాయకులు పుల్లూరు వేణుగోపాల్, పనికల రాజేష్, శనిగరపు శ్యాం సుందర్, కత్తి రమేష్, రాము నాయక్, సారంగపాణి, పెన్షనర్ల సంఘం బాధ్యులు సర్వర్ హుసేన్, గోవర్ధన్, మల్లికార్జున్ పాల్గొన్నారు.