
వరంగల్ అర్బన్: వరంగల్ మహా నగర పరిధిలో అవలంబిస్తున్న వివిధ అధునాతన శానిటేషన్ విధానాలు అత్యుత్తమంగా ఉన్నాయని బంగ్లాదేశ్, నేపాల్ మేయర్ల బృందం కితాబిచ్చింది. జీడబ్ల్యూఎంసీ చేపడుతున్న శానిటేషన్ పద్ధతులను బుధవారం వివిధ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో ఆయా దేశాల మేయర్లు, ప్రతినిధుల బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా బృందం సభ్యులు వడ్డేపల్లిలో గల పబ్లిక్ టాయిలెట్స్‌ని పరిశీలించి నిర్వహణ తీరును అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ్య నిర్వహణపై ఆస్కీ ప్రతినిధి రాజమోహన్ వారికి వివరించా రు. అమ్మవారిపేటలోని మలం, వ్యర్థాల శుద్ధి కర్మాగారం (ఎఫ్‌ఎస్‌టీపీ), హనుమకొండ అంబేడ్కర్ నగర్‌లోని డీ సెంట్రలైజ్డ్ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, వరంగల్ పరిధి ఎంహెచ్ నగర్‌లోని స్లమ్ ప్రాంతాన్ని సందర్శించారు. పలు కాలనీల ప్రజల జీవన స్థితిగతులు, ప్రభుత్వం ద్వారా అందుతున్న సేవలపై ఆరా తీశారు. నగర పర్యటనలో ఆయా దేశా ల మేయర్లు ఎండీ ఖలీధ్ హోస్సేన్, జఖియా ఖతూ న్, ఎండీ ముషారఫ్ హోస్సేన్, ఖాజీ మహమ్మదుల్ హస్సన్, హాజీ ఎండీ అబ్దుల్ ఘని, అంజుమ్ అర బేగం, నిర్మలేందు చౌదరి, మోహియుద్దీన్ అహ్మద్, రఫీక అక్తర్ జహన్, పర్వేజ్ రెహమాన్, రజావుల్ కరీం, సయ్యద్ మునిరుల్ ఇస్లాం, ఎండీ ఖయ్యూం సహ రియల్ జహిదితోపాటు ట్రైనింగ్ స్పెషలిస్ట్ మహమ్మద్ ఇంతియాజ్ షరీఫ్, అబ్దుల్ అమీన్ మున్షి, పరిమల్ కుమార్ దేవ్, కార్పొరేటర్ సురేష్ జోషి, ఆిస్కీ సిబ్బంది పాల్గొన్నారు.
నగరంలో బంగ్లాదేశ్, నేపాల్
మేయర్ల బృందం పర్యటన