
హుండీ లెక్కింపును పరిశీలిస్తున్న ఈఓ అద్దంకి నాగేశ్వర్‌రావు, పరిశీలకులు సంజీవరెడ్డి
ఐనవోలు: ఐనవోలు శ్రీమల్లికార్జున స్వామి దేవాలయంలో మంగళవారం హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. ఫిబ్రవరి 28 నుంచి ఈ నెల 28 వరకు 28రోజులకు గాను హుండీల్లో రూ. 29,72,202, వివిధ టికెట్ల ద్వారా రూ.91,10,124 రాగా మొత్తం రూ.1,20,82,326 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈఓ అద్దంకి నాగేశ్వర్‌రావు తెలిపారు. హుండీల్లో లభ్యమైన వెండి, బంగారాన్ని యధావిధిగా వాటిలోనే వేసి సీల్ చేశామన్నారు. దేవాదాయ శాఖ పరిశీలకులు జి సంజీవరెడ్డి పర్యవేక్షణలో జరిగిన లెక్కింపు కార్యక్రమంలో ఎస్సై గుగులోతు వెంకన్న, కానిస్టేబుళ్లు ఎం.రాజు, శ్రీనివాస్‌రెడ్డి, మహబూబాబాద్ శ్రీ లక్ష్మి వేంకటేశ్వర సేవాసమితి సభ్యులు, దేవాలయ అర్చక, సిబ్బంది పాల్గొన్నారు.
హుండీ, టికెట్ల ద్వారా
రూ.1.2 కోట్ల ఆదాయం