
నర్సరీని పరిశీలిస్తున్న కలెక్టర్ సిక్తా పట్నాయక్
ఆత్మకూరు: రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య మహిళా క్లినిక్‌ల ద్వారా అందిస్తున్న వైద్యసేవలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ కోరారు. మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహిస్తున్న ఆరోగ్య మహిళా క్లినిక్‌ను మంగళవారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలకు సరైన ఆరోగ్య సంరక్షణ సేవలు అందించేందుకు సమగ్ర మహిళ ఆరోగ్య పథకం రూపొందించినట్లు తెలిపారు. ప్రతి మంగళవారం 50 నుంచి 100మందికి తగ్గకుండా మహిళలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలన్నారు. వారు ఎదుర్కొంటున్న ప్రధానమైన ఎనిమిది ఆరోగ్య సమస్యల గురించి అవగాహన కల్పించాలని వైద్యసిబ్బందికి సూచించారు. పరీక్షల కోసం వచ్చిన వారి సమస్యలను తెలుసుకున్నారు. ఆన్‌లైన్‌లో మహిళల వివరాల నమోదును పరిశీలించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సహజ ప్రసవాలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని వైద్యాధికారిణి డాక్టర్ స్పందన, సిబ్బందిని ఆదేశించారు. అనంతరం నీరుకుళ్లలో కొనసాగుతున్న కంటివెలుగు శిబిరాన్ని కలెక్టర్ పరిశీలించారు. అంధత్వ నివారణ లక్ష్యంగా కొనసాగుతున్న కంటిపరీక్షలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చిరుధాన్యాల అవగాహన కార్యక్రమాన్ని, నర్సరీని పరిశీలించారు. హరితహారం ఏర్పాట్ల విషయం తెలుసుకున్నారు. నర్సరీలలో మొక్కల పెరుగుదలకు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామ అభివృద్ధిలో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్ బి.సాంబశివరావు, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ స్పందన, ఆయుష్ డాక్టర్ చైతన్య, మండలస్పెషల్ ఆఫీసర్ రాంరెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాస్‌రెడ్డి, తహసీల్దార్ సురేష్‌కుమార్, ఆప్తాల్మిక్ అధికారి రవిందర్‌రెడ్డి, సూపర్‌వైజర్ సర్సమ్మ, ఎంపీఓ చేతన్‌కుమార్‌రెడ్డి, ఐసీడీఎస్ సీడీపీఓ భాగ్యలక్ష్మి, సూపర్‌వైజర్ పద్మావతి, సర్పంచ్ అర్షం బలరామ్ పాల్గొన్నారు.
కలెక్టర్ సిక్తా పట్నాయక్

ఆత్మకూరులో ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్ సిక్తా పట్నాయక్