
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు మంగళవారం ముగిశాయి. చివరి రోజు హనుమకొండ జిల్లాలో 602మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జనరల్, ఒకేషనల్ కోర్సులు కలిపి 19,192మందికిగాను 18,590మంది విద్యార్థులు హాజరయ్యారని డీఐఈఓ గోపాల్ తెలిపారు. వరంగల్ జిల్లాలో చివరి రోజు పరీక్షలకు 6,853 మంది విద్యార్థులకుగాను 6,454మంది హాజరుకాగా, 399 మంది గైర్హాజరయ్యారని డీఐఈఓ మాధవరావు తెలిపారు. పరీక్షలు ముగియడంతో విద్యార్థులు ఇంటిబాట పట్టారు. తల్లిదండ్రులు హాస్టల్‌లో
ఉంటున్న తమ పిల్లలను అంతా సర్దుకుని తీసుకెళ్లారు. దీంతో హనుమకొండ, వరంగల్ బస్టాండ్లు, వరంగల్, కాజీపేట రైల్వేస్టేషన్లు రద్దీగా మారాయి.
– విద్యారణ్యపురి/కాళోజీ సెంటర్



