ఐఆర్‌ఆర్ నిర్వాసితుల డబ్బులను బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసినట్లు వస్తున్న వదంతుల్లో వాస్తవం లేదు. అన్ని భూపత్రాలు సరిగా ఉండి.. రెవెన్యూ విభాగం పంపించినా ఎంజాయిమెంట్ సర్వే నివేదికలు ఆధారంగా చేసుకొని కొందరు నిర్వాసితులకు పరిహారం ఇస్తున్నాం. ఫ్యామిలీ వివాదాలు, కోర్టు కేసులు ఉన్న వాటిని మాత్రం పెండింగ్‌లో ఉంచాం. వీటిని పరిష్కరించేందుకు క్షేత్రస్థాయిలో రెవెన్యూ అధికారులతో కలిసి పర్యటిస్తున్నాం. కలెక్టర్ ప్రావీణ్య భూసేకరణ నోటిఫికేషన్ ఇవ్వగానే పెండింగ్‌లో ఉన్న వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తాం. కోర్టు కేసుల్లో ఉన్నవాటి విషయంలో డబ్బులు కోర్టులోనే డిపాజిట్ చేస్తాం. అప్పుడు ఆ కేసు ఎవరు నెగ్గుతారో వారి ఖాతాల్లో ఆ డబ్బులు జమ అవుతాయి. – అజిత్‌రెడ్డి, కుడా ప్లానింగ్ ఉన్నతాధికారి
●