వరంగల్ లీగల్: నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ రూపొందించిన లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్ మాడిఫైడ్ స్కీం –2022లో భాగంగా వరంగల్ జిల్లాలో పనిచేసేందుకు ఆఫీస్ అసిస్టెంట్, రిసెప్షన్ కమ్ డేటా ఎంట్రీ అపరేటర్, ఆఫీస్ ప్యూన్ పోస్టుల (ఒక్కొక్కటి చొప్పున) భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వరంగల్ జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె.రాధాదేవి, కార్యదర్శి జె.ఉపేందర్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసినట్లు పేర్కొన్నారు. రెండేళ్ల పాటుకు గాను కాంట్రాక్ట్ ప్రాతిపాదికన ఈ పోస్టులు భర్తీ చేయనున్నట్లు వివరించారు.
ఆసక్తి గత యువతి, యువకులు దరఖాస్తులు, విద్యా రికార్డులు, టెస్టిమోనియల్ మొదలైన వాటిని స్వీయ ధ్రువీకరణ కాపీలతో ఈనెల 31వ తేదీ లోపు జిల్లా న్యాయసేవాధికార సంస్థ, వరంగల్‌లో అందజేయాలని సూచించారు. మరిన్ని వివరాలకు 9440901063 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.